కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ లేని దర్శకులు వీళ్లే..!!

-

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత సినిమాకు విశేషమైన ప్రేక్షకులున్నారని చెప్పొచ్చు. ఇండియన్ మూవీస్ ను ఇతర దేశాల ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకులు తెరకెక్కిస్తున్న విజ్యువల్ గ్రాండియర్ ఫిల్మ్స్ చూసి ఫిదా అవుతున్నారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు చిత్ర సీమ ఖ్యాతినే కాదు భారతీయ సినిమా స్టాండర్డ్స్ పెంచారని ఈ సందర్భంగా సినీ పరిశీలకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అపజయం ఎరుగని భారతచిత్ర సీమ దర్శకులను గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటి వరకు తీసింది 12 సినిమాలు కాగా, అన్ని కూడా సూపర్ హిట్ ఫిల్మ్సే కావడం విశేషం. RRR పిక్చర్ తో ఇండియన్ బాక్సాఫీసు రికార్డులన్నిటినీ తిరగరాశారు. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా కోసం స్టోరి రెడీ చేసుకుంటున్నారు.

ఇక ఆయన తర్వాత తెలుగులో అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఇప్పటి వరకు ఆయన తీసిన ఫిల్మ్స్ అన్నీ కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. కాగా, ఈయన చిత్రాల్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంటుంది.

ఇక కోలీవుడ్ విషయానికొస్తే డైరెక్టర్ హెచ్.వినోద్ తీసింది నాలుగు సినిమాలు కాగా, ఆ నాలుగు పిక్చర్స్ కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడం విశేషం. తమిళ్ తాలా..అజిత్ కుమార్ తో ‘నెక్కొండ పర్వమ్’, ‘వలిమై’ సినిమాలు తీసిన వినోద్..మళ్లీ అజిత్ తో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు.

అరుణ్ కుమార్ అలియాస్ అట్లీ కూడా..అపజయం ఎరుగని దర్శకుల జాబితాలోనే ఉన్నారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ ఎస్.శంకర్ వద్ద పని చేసిన అట్లీ..నాలుగు సినిమాలు చేయగా, నాలుగు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

లోకేశ్ కనకరాజ్..కూడా అపజయం ఎరుగని దర్శకుడు. ఇటీవల విడుదలైన ‘విక్రమ్’ ఫిల్మ్ తో లోకేశ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మరో దర్శకుడు  వెట్రి మారన్ తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ గా నిలవడం విశేషం.

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ(శాండల్ వుడ్) విషయానికొస్తే..డైరెక్టర్ ప్రశాంత్ నీల్..కన్నడ ప్రైడ్ మాత్రమే కాదు ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ అయిపోయారు. KGF చాప్టర్ 1, చాప్టర్ 2తో సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు మూడు సినిమాలు తీయగా మూడు సూపర్ హిట్ అయ్యాయి.

మరో దర్శకుడు..సంతోశ్ ఆనంద్ రామ్..సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇతని డెబ్యూ ఫిల్మ్ ‘మిస్టర్ రామాచారి’ తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంతోశ్ ఆనంద్ రామ్.. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో ‘రాజ్ కుమార’, ‘యువరత్న’ సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. మరో కన్నడ యువ దర్శకుడు చేతన్ కుమార్ కూడా ఇప్పటి వరకు నాలుగు సినిమాలు తీయగా, నాలుగు కూడా బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి.

బాలీవుడ్ విషయానికొస్తే..సందేశంతో పాటు కమర్షియల్ అంశాలన్నీ అత్యద్భుతంగా చెప్పే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version