ప్రభాస్ కి అన్ని వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో తెలుసా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా ఎదిగి గుర్తింపు తెచ్చుకొని .. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరో ప్రభాస్. చేసింది కొన్ని సినిమాలే అయినా పాన్ ఇండియా హీరోగా ఎదగడం అంటే అంత ఆషామాషీ కాదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఆయన రేంజ్ రూ. 100 కోట్లు అన్నట్లుగా మారిపోయింది. దర్శక నిర్మాతలు సైతం ప్రభాస్ తో సినిమా తీయాలి అంటే ముందుగానే బడ్జెట్ ను నిర్ణయించుకొని ప్రభాస్ దగ్గరకు ప్రత్యేకంగా కథలు వినిపించడానికి వెళ్తూ ఉండటం గమనార్హం.

 

ఇకపోతే తాజాగా కొన్ని వేల కోట్ల ఆస్తులకు ప్రభాస్ వారసుడు అనే వార్త బాగా వినిపిస్తోంది. ఇక ఇంత ఆస్తి ప్రభాస్ కి రావడానికి గల కారణం ఏమిటి..? కేవలం సినిమాల ద్వారానే ఆయన స్వతహాగా ఇంత సంపాదించారా..? అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ప్రభాస్ తండ్రి సత్యనారాయణ రాజు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈయన చెన్నై, బెంగళూరు తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేశారట. ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు.

ఇక అటు సత్యనారాయణ రాజు, ఇటు కృష్ణంరాజుకి ఏకైక వారసుడు ప్రభాస్ కావడం గమనార్హం.
కృష్ణంరాజుకు పిల్లలు ఉన్నా.. మగ పిల్లలు లేకపోవడం వల్ల ఆ ఇంటికి వారసుడిగా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం అటు సత్యనారాయణ రాజు, ఇటు కృష్ణంరాజు ఇద్దరు కలిసి వివిధ నగరాలలో ఫామ్హౌస్లో ను నిర్మించారు. అలాగే వీరికి మల్టీప్లెక్స్ థియేటర్ ల తో పాటు వ్యవసాయ ఆధారిత పొలాలు.. కొబ్బరి తోటలు ఉన్నాయి. అంతేకాదు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కూడా ఉండడం వల్ల ఇక ఇద్దరి ఆస్తి .. వారసుడైన ప్రభాస్ కి మాత్రమే దక్కుతుంది. కాబట్టి సుమారుగా ఆయనకు రూ. 7వేల కోట్లకు పైగా ఆస్తులు తమ తండ్రుల నుంచి రావడం గమనార్హం. ఇక అలా రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version