ఇన్‌స్టాగ్రామ్ లో మీకు నచ్చని వారు చేసే కమెంట్స్ అందరికీ కనిపించకుండా ఇలా చేయొచ్చు.!

-

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ఒకవిధంగా మనకు మంచి టైంపాస్ ఇస్తుందనే చెప్పాలి. అదేంటో ఓపెన్ చేస్తే..అసలు క్లోజ్ చేయాలనిపించదు. పదినిమిషాలు చూద్దాం అని తీస్తాం..గంటైనా ఇట్టే గడిచిపోయిందా అనిపిస్తుంది. టిక్ టాక్ తర్వాత యువత ఇంకా బాగా ఇన్‌స్టాగ్రామ్ కు దగ్గరయ్యారు. ఇందులో రీల్స్ ఆప్షన్ ని కూడా బాగా వాడేస్తున్నారు. బయట మనకు ఫ్యాన్స్ లేకున్నా..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ హే మనకు ఫ్యాన్స్ మరి.. అయితే అందులో కొందరు మీరు చేసే రీల్స్ కి లేదా పెట్టే పోస్టులకు మీకు నచ్చని కమెంట్స్ ఇస్తుంటారు.

ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram

ఈ బాధ ఎందుకని చాలామంది ఫాలోవర్స్ ఉన్న వాళ్లు కమెంట్ ఆప్షన్ ఆపేస్తారు. లేదా..లిమిటెడ్ మెంబర్స్ నే సెలక్ట్ చేసుకుంటారు. ఇలా చేయటం వల్ల మిమ్మల్ని అభిమానించే వాళ్లు ఇచ్చే మంచి కమెంట్స్ ని మీరు మిస్ అవుతారు..అలా కాకుండా మీకు నచ్చిన వ్యక్తులు కమెంట్స్ మీకు మాత్రమే కనిపిస్తే..ఎవరూ చూడలేదు అనుకోండి..ప్రాబ్లమ్ ఉండదు. వాళ్లు చేసే చెడు కమెంట్స్ ను మీరు అయితే ఇగ్నోర్ చేయొచ్చు లేదా..పర్సనల్ గా వాళ్ల సంగతి చూసుకోవచ్చు. సో మీరు ఎంచుకున్న వ్యక్తి పంపే కమెంట్ మీకు మాత్రమే కనిపించేలా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఆప్షన్ ఉంది. ఇందుకోసం మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం.

ఎవరి కామెంట్స్‌ కనిపించకూడదనుకుంటున్నారో మీరు వారి ప్రొఫైల్‌కు వెళ్లాలి. రైట్ సైడ్ టాప్ లో మూడు డాట్స్ ఉంటాయి కదా..అది క్లిక్ చేయండి. అక్కడ రిస్ట్రిక్ట్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు. కతమ్ ఇగ..వాళ్లు మీకు పెట్టే నెగిటివ్ కమెంట్స్ అన్నీ మీకు మాత్రమే కనిపిస్తాయి. అందరూ చూడలేరు.

రెండో మార్గం ఏంటంటే.. మీరు ఎవరినైతే రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారో వారి డైరెక్ట్‌ మెసేజ్‌ విభాగంలోకి వెళ్లాలి. అనంతరం సదరు వ్యక్తి చాట్‌ను ఓపెన్‌ చేసి.. షేర్డ్ మీడియా, చాట్ సెట్టింగ్‌లోకి వెళ్లి రిస్ట్రిక్ట్ బటన్ క్లిక్ చేయాండి అంతే…

ఇక లాస్ట్ ది… ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోని… తర్వాత కనెక్షన్స్ కింద రిస్ట్రిక్ట్ అకౌంట్స్ క్లిక్ చేయండి.. తర్వాత ఎవరినైతే రిస్ట్రిక్ట్​చేయాలనుకుంటున్నారో సెర్చ్‌ చేసి వారి పేరు పక్కన రిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే చాలు. ఈ మార్గం ద్వారా ఒకేసారి మీకు నచ్చిన వారందరిని రిస్ట్రిక్ట్ చేసేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే ఈ ఆప్షన్ చెక్ చేసి వాడేసేయండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version