భక్తి: ఏ తిధి నాడు దేనికి అనుకూలమో తెలుసా…?

-

మనకి పదిహేను తిధులు. అయితే ఏ తిధి నాడు ఎం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనేది చాల మందికి తెలియదు. అయితే ఎప్పుడు ఎం చెయ్యాలి…?ఎం చెయ్యకూడదు..? ఇలా అనేక విషయాలు మీకోసం. వివరాల లోకి వెళితే… గుర్తుంచుకోండి కొత్త పనులు మొదలు పెట్టకూడదు పాడ్యమి నాడు. ఉద్యోగం, వ్యాపార, వర్తక వాణిజ్యాలు కూడా పాడ్యమి నాడు చెయ్యకండి. కొత్తగా ఏమైనా పనులు మొదలు పెట్టిన బాగా జరుగుతాయి విదియ నాడు. వివాహాలలు చేసుకోవడానికి ఇది మంచిదే. ఏ పని చేసిన కార్యసిద్ధి కలుగుతుంది. కనుక విదియ నాడు ఏమైనా ప్రారంభం కూడా చెయ్యొచ్చు.

ప్రయాణాలు పెట్టుకుంటే తదియ రోజు చాలా మంచిది. ఉత్తర దిక్కు ప్రయాణాలకు ఇంకా శుభం కలుగుతుంది. ఇక చవితి విషయానికి వస్తే… ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది.పెళ్లి చూపులు కూడా పెట్టుకోకూడదు. పంచమి రోజు అన్నింటికి శుభము కలుగుతుంది. షష్ఠి రోజు గొడవలు జరుగుతాయి. కొత్త పనులుచేయకూడదు. సప్తమి రోజు ఎక్కడకు వెళ్లినా కూడా మంచి జరుగుతుంది. కొత్త కష్టాలు వస్తాయి అష్టమి నాడు కాబట్టి ఏమి స్టార్ట్ చెయ్యకండి.

నవమి రోజు కొత్త పనులు వద్దు. దశమి, ఏకాదశి రోజుల్లో ఏ పని మొదలుపెట్టిన విజయం పొందుతారు కాబట్టి స్టార్ట్ చేసేయొచ్చు ఏమైనా. ద్వాదశి , త్రయోదశి రోజుల్లో శుభం కలుగుతుంది. బహుళ చతుర్థీ రోజు అంత మంచిది కాదు. అమావాస్య నాడు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అనుసరిస్తారు. మీ పద్ధతిని మీరు అనుసరించడం మేలు.

 

 

.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version