అయోద్య రామమందిర నిర్మాణ పనులు చక చక సాగిపోతున్నాయి. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళలను ఆహ్వానిస్తుంది. ఫిబ్రవరి 15 నుండి మార్చి 20 వరకు విరాళాల సేకరణ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రారంభించారు. 10 రూపాయలతో మొదలుకొని ఎంతైనా ఇవ్వొచ్చు. అయితే మందిర నిర్మాణానికి 3వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయి.. ఈ మొత్తాన్ని కూడా విరాళాల రూపంలో సేకరించే బృహత్ కార్యాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సంస్థ చేపట్టారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని గాగిల్లాపూర్ గ్రామంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చిన విరాళం తీసుకొని రిసిప్ట్ ఇచ్చి వెళ్లిపోతున్న రామ సేవకులకు చిన్న పాప షాక్ ఇచ్చింది. కనీసం మాటలు కూడా రాని ఆ పాప వాళ్ల దగ్గరికి వచ్చి, తన దగ్గర ఉన్న 10 రూపాయలను ఇచ్చింది. పాప కనీసం మాట్లాడడానికి ఇంకా రాదు ఆ పాప మా చేతిలో ఉన్న కరపత్రంలో రాముని ఫోటో చూసి తన చేతిలో ఉన్న పది రూపాయల చిక్క తీసుకొచ్చి మాకు ఇచ్చింది.. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్య పోయారు.. అంటూ తమ అనుభవాన్ని పంచుకున్నారు రామ సేవకులు. మరో దగ్గర పండు ముసలావిడ తనకు వచ్చే పెక్షన్ డబ్బులు రామ మందిర నిర్మాణం కోసం ఇస్తున్నట్లుగా చెప్పిందంటూ వివరించారు. పసి పాప, పండు ముసలి వారి వారి భక్తిని ఇలా చాటుకున్నారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విరాళాల సేకరణకు వచ్చే వారికి మీరు ఇవ్వదలచిన విరాళాన్ని ఇచ్చి రశీదు తీసుకోవాలి. ఇక రూ. 500 పైన విరాళం ఇవ్వదలచిన వారు నేరుగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చెయ్యవచ్చు..
State Bank Of India (SBI)
A/c Name: Shri Ram Janmbhoomi Teerth Kshetra
Branch : AYODHYA (Naya Ghat, Ayodhya, U.P.)
Current Account : 39161498809
or Savings Account Number : 39161495808
IFSC Code : SBIN0002510
PAN NO : AAZTS6197B
Punjab National Bank
A/c Name: Shri Ram Janmbhoomi Teerth Kshetra
Branch: Naya Ghat, Ayodhya U.P.
Account No: 3865000100139999
IFSC Code: PUNB0386500
Bank of Baroda
A/c Name: Shri Ram Janmbhoomi Teerth Kshetra
Branch: Naya Ghat, Ayodhya U.P.
Account No: 05820100021211
IFSC Code: BARB0AYODHY
ఆన్‌లైన్ ద్వారా విరాళాలు ఇవ్వదలచిన వారు.. https://srjbtkshetra.org/donate/
ద‌్వారా కూడా ఇవ్వవచ్చు..