కిడ్నీ లో రాళ్లు రాకుండా ఉండాలంటే ఏ ఏ ఆహరాలు తీసుకోవాలో తెలుసా..?

-

ఇప్పుడున్న జీవన విధానంలో సరైన ఆహారం తీసుకునేంత టైమ్ కూడా ఉండడం లేదు. ఇలా సరైనా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము.ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాధపడుతున్న సమస్య కిడ్నీలో రాళ్లు ఏర్పడటం. ఈ సమస్య ఎక్కువగా సరైన మొత్తంలో నీరు త్రాగకపోవడం, సరైన సమయంలో యూరిన్ విసర్జన చేయకపోవడం వల్ల వస్తుంది.
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. కనీసం రోజులో 4 లీటర్లు నీళ్లు త్రాగుతుండాలి. ఇవే కాకుండా కొన్ని ఆహారాలను తరుచుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.

కిడ్నీలో రాళ్లు రాకుండా ఏఏ పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించాలంటే సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ చీని మొదలైనవాటిని తరుచుగా తీసుకుంటూ ఉండాలి.ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ లో రాళ్లు ఏర్పడేలా చేసే కాల్షియం-ఆక్సలేట్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది.కొబ్బరి నీళ్లలో పీచు అధిక మోతాదులో ఉండడం వల్ల రాళ్లు రాకుండా చేస్తుంది. మరియు రాళ్లు ఉన్న వారికి రాళ్లను తొలగించే శక్తి ఉంటుంది .అలాగే పప్పుదినుసులు,కూరగాయలు ఆకులు, క్యారెట్లు ఇంకా దుంపలు వంటి ఆహారాలు రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి.ఇంకా అలాగే చెరకు రసం మూత్రపిండాల్లో పేరుకొనే స్పటికాలను నివారించే గుణాలు ఇందులో ఉన్నాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారు ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాళ్లను ఏర్పడకుండా లేదా పెరగకుండా నిరోధించడానికి రాళ్లు ఏర్పడటానికి కారణం అయినా ఆక్సలేట్, సోడియం,కాల్షియం లేనీ ఆహారాన్ని తీసుకుంటుండాలి. అధిక ఆక్సలేట్లు ఉన్న టమోటా, యాపిల్,బచ్చలికూర వంటి ఆహారాలను తీసుకోకూడదు.అధిక పైబర్ ఉండే చిరుధాన్యాలు, గింజలను తింటే ఇవి రాళ్లు పెరగడానికి దోహదపడతాయి.గుడ్లు,మాంసం, చేపలు,పాలతో చేసిన ఆహారాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోకూడదు.అలాగే ముల్లంగి, క్యారెట్, వెల్లుల్లి, ఉల్లిపాయలలో సోడియం, ఆక్సలేట్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.కిడ్నీల్లో రాళ్లు ఉంటే మద్యం కూడా అస్సలు సేవించకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version