43 ఏళ్ల క్రితం మహేష్ బాబు జీవితంలో ఇదే రోజు ఏం జరిగిందో తెలుసా.. !

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన అభిమానులకి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు.. మరి అంత ప్రత్యేకమైన రోజు కోసం కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలోని ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు ఆయన అభిమానులకు కూడా ప్రత్యేకమైనదే అంతటి విశేషమైన ఈరోజు ప్రత్యేకత ఏంటంటే.. మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరి మనస్సులను దోచుకుంది.. తన సినీ ప్రయాణానికి పునాది పడింది ఈరోజే. ఈ సందర్భంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ చిన్ననాటి ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఆ రోజున గుర్తు చేసుకుంటున్నారు.

`దర్శక రత్న దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన ‘నీడ’అనే చిత్రంలో తొలిసారిగా మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.. 1979లో విడుదలైన ఈ చిత్రంలో మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో మొదటిసారి మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అప్పట్లో ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి మహేష్ బాబుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు క్యూ కట్టాయి.. మహేష్ బాబు ఆర్టిస్ట్ గా మొత్తం 9 చిత్రాల్లో నటించారు అయితే ఇందులో దాదాపు 7 చిత్రాల వరకు తండ్రి కృష్ణతో కలిపి నటించడం విశేషం..

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 27 ఏడు సినిమాల్లో నటించిన మహేశ్.. తనదైన నటనతో సినిమాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. చిన్ననాటి నుంచి సినీ ప్రపంచాన్ని చూస్తూ పెరిగిన మహేష్ రాజకుమారుడు చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.. తన జీవితం ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా క్రమశిక్షణతో, నిబద్ధతతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఫలితంగా ఈరోజు టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం దక్కిచుంకున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version