ఇరుముడి వెనకున్న ఆంతర్యం ఏంటో తెలుసా.?

-

కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఆలయాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే కనిపిస్తున్నారు..రోజూ రెండు పూటలా చన్నీళ్లతో స్నానం..నేలపైనే నిద్ర..మాట జారకుండా అయ్యప్ప నామ స్మరణ..శత్రువుల్లో కూడా స్వామినే చూసే గుణం..మండల దీక్షతో మనసుని పునీతం చేసుకునే ఓ పుణ్య క్రతువు అది…. 41 రోజులు అత్యంత నియమ నిష్టలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధనే అయ్యప్ప మండల దీక్ష. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకుని వచ్చాక దీక్ష విరిమిస్తారు. అయితే.. అసలు ఇరుముడి అంటే, అయ్యప్ప మాల వేసుకున్నవారు ఎందుకు నలుపురంగు వస్త్రాలే ధరించాలి..? వీటి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?
అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్లు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నింటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుందట. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షధారుడి హృదయం పరమాత్మలో విలీనం అవుతుందని పురాణాల్లో చెప్పారు.. అయ్యప్ప పూజలో ప్రధానాంశం ‘శరణుఘోష’. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్నిస్తుందని అంటారు. శరణాగతి వేడిన భక్తుల బాగోగులు స్వయంగా దేవుడే చూసుకుంటాడని విశ్వాసం.
ఇరుముడి వెనకున్న ఆంతర్యం ఏంటి..?
మండల దీక్ష పూర్తైన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకుని బయల్దేరుతారు స్వాములు. ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక అనమాట…ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులోని ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు.
18 మెట్లపై ఏం వదిలేయాలంటే ..
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు అంటారు.. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి.
తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి.
ఆ తర్వాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచన.
చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.
దీక్ష విరమించిన వెంటనే మళ్లీ పాత అలవాట్లకు లోబడితే ఆ దీక్ష ధారణకు అర్థం -సార్థకం ఉండదు.. మాల విరమించినా నియమాలు లేకున్నా..వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత చేకూరుతుంది. చాలామంది మాలలో ఉన్న అన్ని రోజులు మాత్రం చెడు అలవాట్లకుదూరంగా ఉండి..మాలవిరమించిన వెంటనే.. మళ్లీ దందా షూరూ చేస్తే..అసలు వేసుకోని ఏం లాభం.. మండల దీక్షలో సైంటిఫిక్‌ రీజన్.. ఒక మనిషి ఏదైనా నియమాన్ని 21-41 రోజులు పాటిస్తే..ఆటోమెటిక్‌గా అది ఆ వ్యక్తికి అలవాటైపోతుంది. కాబట్టి..సిగిరెట్‌,బీడి, మందు లాంటి వాటిని ఆ రోజుల్లో పక్కనపెడితే..ఆ తర్వాత కూడా వాటిమీద ముందు ఉన్నంత వ్యామోహం ఉండదు..అలా అవి దూరం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version