దెయ్యాల ఇల్లును ఎప్పుడైనా చూశారా? అదేంది దెయ్యాలకు ఇల్లు కూడా ఉంటుందా.. అది ఎక్కడ ఉంటుంది.. అవి మనుషులను ఏమి చెయ్యవా.. ఇలా చాలా సందెహాలు రావడం సహజం..అయితే అది ఒక ఇల్లు..అందులో లెక్కలెనన్ని దెయ్యాలు నివసిస్తాయని అంటుంటారు.అటువైపు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించరు..ఆ ఇల్లు చాలా పురాతన కాలం నాటిది..1736లో ఆ ఇంటిని నిర్మించారు.
1971 నుంచి 1980 సంవత్సరం వరకు ఆ ఇంట్లో పెరాన్ కుటుంబం నివసించేది. అప్పట్లో ఆ ఇంటిలో వారు దెయ్యాలతో అనేక ఇబ్బందులు పడ్డారని కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయితే పెద్దగా ఎవరూ నమ్మకపోయినా 2013 తరువాత ఆ ఇంటివైపు చూడటానికి కూడా చాలా మంది సాహసించలేదు. 2013లో కంజ్యూరింగ్ అనే సినిమా తెరకెక్కింది. ఆ ఇంటిలో దెయ్యాల గురించే ఈ సినిమా. అప్పట్లో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతమోగింది. అదే సమయంలో అక్కడ దెయ్యాలుంటాయని ప్రపంచానికి తెలిసింది.. అలా ఆ ఇల్లు ఘోస్ట్ హౌస్ గా మారింది.
ఆ తర్వాత ఆ ఇంట్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా అనే విషయాన్ని కనిపెట్టడానికి చాలా మంది ప్రయత్నించారు.2019లో జెన్, కోరి హైన్‌జన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఇంటిని 4,39,00 డాలర్లకు కొనుగోలు చేశారు. వీరిద్దరు ఆ ఇంటిలో నిజంగా ఆత్మలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకొనేందుకు పరిశోధనలు చేశారు. కొన్నాళ్లు పరిశోధనలు చేసిన తరువాత ఏమైందో ఏమోకానీ ఆ ఇంటిని 1.2 మిలియన్ డాలర్లకు 2021 సెప్టెంబరులో విక్రయానికి పెట్టారు… అయితే ఓ వ్యక్తి దాన్ని 1.5 మిలియన్ డాలర్లకు కొన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ అంది మాత్రం తెలియలేదు..అసలు ఆ ఇంటిని ఎందుకు వాడతారు అనే విషయం తెలియాల్సి ఉంది..