లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ పెడితే ఏం జరుగుతుందో తెలుసా..?

-

లాఫింగ్ బుద్ధ విగ్రహం గురించి మీకు తెలిసే ఉంటుంది. బానపొట్టతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే విగ్రహం అది. అయితే ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే అంతా శుభమే కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఈ విగ్రహాన్ని ఎవరూ తమకు తాముగా కొనుగోలు చేయరు. దీన్ని బహుమతి రూపంలో తీసుకుని ఇంట్లో పెట్టుకోవాలని చెబుతారు. అయితే ఇలా బహుమతిగా తీసుకునే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పలు నిర్దిష్టమైన చోట్లలో పెడితే పలు లాభాలుంటాయి. అవేమిటంటే…

1. ఇంట్లో ప్రశాంతత కరువై, కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటే ఇంటి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఇది ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అన్యోన్యతను పెంచుతుంది. గొడవలు లేకుండా చూస్తుంది.

2. కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఎంతకీ ఉద్యోగం దొరకకపోతుంటే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచాలి. దీంతో లక్ కలసి వచ్చి ఉద్యోగం సాధిస్తారు. అలాగే ఆ ఇంట్లో డబ్బులకు కూడా కొరత ఉండదు.

3. ఎవరికైనా ఉద్యోగ జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతున్నట్లయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో అందరి దృష్టి పడే చోట పెట్టాల్సి ఉంటుంది. అంటే.. అందరూ సాధారణంగా టీవీని ఎక్కువగా కలసి చూస్తారు కదా. అలా అందరి దృష్టి ఒకే చోట ఉండే ప్రదేశంలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెడితే సమస్యలు ఎదురవకుండా ఉంటాయి.

4. పైన చెప్పినవి కాకుండా ఇతర ఏ సమస్య అయినా ఇబ్బంది పెడుతుంటే.. అలాంటి వారు రెండు చేతులను పైకెత్తి ఉండే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో తూర్పు వైపుగా ఉంచాలి. ఇలా చేస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది.

5. సంతానం లేని వారు తమ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవాలి. వంట గది లేదా బాత్‌రూం కాకుండా మిగిలిన ప్రదేశాల్లో బాగా నవ్వుతూ ఉండే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే సంతానం త్వరగా కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news