ఏ విటమిన్లు లోపిస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు వస్తాయో తెలుసా..?

-

అందంగా ఉంటే.. సగం ఆరోగ్యంగగా ఉన్నట్లే.. అవును ఈ మాట ముఖ్యంగా అమ్మాయిలకు బాగా సరిపోతుంది. ఫేస్‌ పాడైపోతున్నా, ముఖంపై మచ్చలు, మొటిమలు, పొడిబారటం, నల్లగా ఉండటం, జుట్టు రాలటం ఇలాంటి సమస్యలు ఉంటే అమ్మాయిలు తెలియకుండానే చాలా కుంగిపోతారు. మానసికంగా ఆందోళన చెందుతారు. అది వారి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. అసలు మొటిమలు, మచ్చలు రావడానికి ఏ విటమిన్‌ లోపమో తెలుసా.? తెలియదా.. వెంటనే ఈ ఆర్టికల్‌ మొత్తం చదివేయండి..!
శరీరంలో విటమిన్లు, పోషకాల లోపంతో వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా విటమిన్ల లోపంతో ముఖంపై అవాంఛిత మచ్చలు ఏర్పడతాయి. ఇవి పోవాలంటే ముందు విటమిన్ లోపం ఉండకూడదు. విటమిన్ సి అనేది చర్మానికి ప్రయోజనకరం. విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తిలో దోహదపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటే ఏ విధమైన మచ్చలు ఏర్పడవు. విటమిన్ సి కోసం..ఆరెంజెస్, బత్తాయి, ఉసిరి, నిమ్మకాయ, జాంకాయ తింటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
ముఖంపై మచ్చలకు విటమిన్ డి లోపం కూడా కారణమే.. ఈ సమస్యను దూరం చేయాలంటే..పాల ఉత్పత్తులు చాలా కీలకం. గుడ్లు, చేపలు, మాంసం తినడం ద్వారా విటమిన్ డి లోపం పూర్తి చేయవచ్చు. చర్మాన్ని నిగనిగలాడేలా చేయాలంటే పాల ఉత్పత్తుల్ని తప్పకుండా సేవించాల్సి ఉంటుంది. కొంతమందికి శరీరంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి..దానికి ప్రధాన కారణం.. విటమిన్‌ డీ లేకపోవడమే.. మచ్చలు ఎక్కువగా ఉంటే.. డీ విటమిన్‌ టాబ్లెట్స్‌ కూడా వేసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ బి 12 లోపం కారణంగా పిగ్మంటేషన్ సమస్య తలెత్తుతుంది.. విటమిన్ బి 12 లోపంతో ముఖంపై వివిధ రకాల మచ్చలు ఏర్పడుతాయి. వీటీని దూరం చేసేందుకు డైట్‌లో పాల ఉత్పత్తులు, ఆకుపచ్చని కూరగాయలు తినాలి..
మెలానిన్ అనేది చర్మం రంగుకు కారకం. శరీరంలో మెలానిన్ ఎక్కువైతే చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. విటిమిన్ ఇ పుష్కలంగా ఉండే పదార్ధాలు తీసుకుంటే ఈ లోపం అరికట్టవచ్చు. మెలానిన్‌ కారణంగా స్కిన్‌ డార్క్‌ అవుతుంది. ఇది తలలో ఎక్కువగా ఉంటే జుట్టు నల్లగా ఉంటుంది. కానీ మనకు ముఖంలో ఎక్కువగా ఉండి తలలో తక్కువగా ఉంటుంది. అదేంటో మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version