ఈ మధ్య కాలంలో నేరాలకు పాల్పడిన నిందితులు కనీసం కోర్టులోనైనా కాముగా ఉంటారంటే.. ఉండటం లేదు. కోర్టుల్లో కూడా తమ నేర బుద్ధిని చూపిస్తూ తమ శిక్షను పెంచుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు.
రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జీర్జించుకోలేకపోయిన నిందితుడు.. న్యాయమూర్తి పై ఒక్కసారిగా చెప్పు విసిరాడు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.