కాజల్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించి ఉండరు..!

-

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చందమామ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఇక తన అందం, అభినయంతో ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే వరుస సినిమా ఆఫర్స్‌ను సొంతం చేసుకుంది.ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోను పలు చిత్రాల్లో ఆడి పాడి తన నటనతో మెప్పించింది.

ఇదిలా ఉండగా.. కాజల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట్లా చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే కాజల్ అగర్వాల్ కు ఇష్టమైన హీరో గురించి ఇటీవల ఓ సందర్బంలో రీవిల్ చేసింది.. ఆమె ఇష్టమైన హీరో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ తో కలిసి రెండు చిత్రాలలో నటించింది. అలాగే పక్కా లోకల్ అనే సాంగ్ లో ఎన్టీఆర్ సరసన డ్యాన్స్ ఇరగదీసింది. అతనంటే ఆమెకు చాలా ఇష్టమట.. మళ్లీ అతని మూవీలో అవకాశం వస్తే అసలు వదులుకోనని చెప్పుకొచ్చింది.. ఇక తమిళ్లో హీరో విజయ్ అంటే ఇష్టమని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news