ఏటీఎం పిన్ నెంబర్ నాలుగు అక్షరాలే ఎందుకు ఉంటాయో తెలుసా?

-

ఒకప్పుడు డబ్బులను డ్రా చెయ్యాలంటే చాలా తల నొప్పి..బ్యాంక్ కు వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసి దానిని బ్యాంక్ ఉద్యోగి దగ్గరకు వెళ్ళి దాని ఇచ్చి లైన్ లో వేచి చూస్తూ డబ్బులను తీసుకోవాలి. అందుకు చాలా సమయం పట్టేది.కానీ ఇప్పుడు అంత సమయం పట్టదు..టెక్నాలజీ పెరిగిపోవడంతో ఏటీఎం మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏటీఎం కార్డు తీసుకుని.. ఇలా వెళ్లి, అలా డబ్బు తీసుకుని బయటికి వచ్చే వెసులుబాటు వచ్చింది.

 

అయితే నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో పాటూ ఫోన్‌పేలు, గూగుల్‌ పే, పేటీఎం ద్వారా లావాదేవీలు జరపడం పెరిగిపోయింది. ఈ విషయం పక్కన పెడితే.. అసలు ఏటీఎం కార్డుకు నాలుగు అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయని చాలా మంది ఆలోచించి ఉండరు. అసలు నాలుగు అంకెలు మాత్రమే ఎందుకు పెట్టారనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్కాటిష్ శాస్త్రవేత్త జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్ 1969లో ATM యంత్రాన్ని కనుగొన్నారనే విషయం తెలిసిందే. మొదట్లో ఏటీఎం పిన్ 6 నంబర్ల తో ఉండేది. అయితే ఈ విధానం వల్ల చాలా మంది పిన్ నంబర్ మరచిపోవడం జరుగుతుండేది. ఈ విషయంలో ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు రావడంతో అంతా సులువుగా గుర్తుంచుకునేందుకు వీలుగా ఉండేలా నాలుగు నంబర్లకు కుదించారు. అయితే ఆరు నెంబర్లు ఉండడం వల్ల గుర్తుంచుకోవడం ఇబ్బంది అయినా కూడా ఈ నంబర్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టం.. ఇకపోతే ఈ వ్యక్తి మన భారతీయుడే కావడం విశేషం.. 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా అడ్రియన్ షెపర్డ్ జన్మించిన మేఘాలయలోని ఓ ఆస్పత్రిలో తొలిసారిగా మెషిన్‌ను ఏర్పాటు చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news