తమలాపాకుకు అంతటి విశిష్టత ఎందుకొచ్చిందో తెలుసా..?

-

భారతదేశ చరిత్రలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానం ఉంది. పూజలు, శుభకార్యాల్లో మనం వాడే ప్రతి వస్తువుకు ఒక్క ఆయుర్వేద మూలికంగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేద నిపులు ఆయా వ్యాధులకు చికిత్సగా ఈ మూలికలను వాడారు. వివిధ రకాల మొక్కలు, ఆకులు, వేళ్లను పరిష్కారంగా సూచించారు. కర్మకాండలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు జరిగినప్పుడు కచ్చితంగా తమలాపాకును వాడుతారు.

తమలాపాకు-ఆంజనేయ స్వామి

ఏ ఆకుకు ఇంతటి ప్రాధాన్యత చోటు చేసుకోలేదు. దేవుడి దగ్గర కూడా పెట్టే ఏకైక ఆకు తమలపాకు. ఎందుకంటే ఈ ఆకులో శరీర రక్షణ వ్యవస్థను కాపాడే గుణం ఉంటుంది. ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లు జరిగినప్పుడు జన సమూహం ఏర్పడుతుంది. తద్వారా ఒకరు పీల్చిన గాలిని మరొకరు పీల్చడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే తమలాపాకులను ఆ ప్రదేశంలో ఉంచడం వల్ల అందులోని రసాయనాలు గాలిలో కలిసి బ్యాక్టీరియాలను అరికట్టడంలో తోడ్పడుతాయి. అలాంటి ఔషధ గుణాలు కలిగిన ఆకును పండితులు ప్రాచీన రోజుల్లోనే గ్రహించి అన్ని కార్యాల్లో వినియోగించేలా వాడుకలోకి తీసుకొచ్చారు. ఒక ఆచారంగా మనం ప్రతి కార్యంలో తమలపాకును ఉపయోగిస్తున్నాం.. కానీ అసలు విషయం ఇది. అసలు తమలాపాకులో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమలాపాకును తినడం వల్ల తెల్లరక్త కణాలు, లింపోసైట్లను వృద్ధికి దోహపడుతాయి. ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ దరి చేరకుండా చూస్తాయి. మోనోసైట్లను పెంచి శరీరానికి చెడు చేసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా తమలాపాకులను తింటే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుందని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. అందుకే చాలామంది తాంబూలం, పాన్ రూపంలో దీనిని తీసుకుంటారు. నూనెలతో కూడిన వంటకాలు, మాంసాహారం పదార్థాలు తిన్నప్పుడు ఒక్క తమలాపాకు తాంబూలాన్ని తీసుకుంటే వెంటనే ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే పిపిరాల్ ఏ, బీ అనేవి కాలేయం శుద్ధి చేయడంలో చాలా బాగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version