షకలక శంకర్ బిక్షాటన.. షూటింగ్ కోసం కాదు.. ఎందుకో తెలుసా..?

జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత వెండితెరపై హీరోగా అవతారమెత్తిన శకలక శంకర్ ప్రస్తుతం కరీంనగర్ వీధులలో బిక్షాటన చేస్తున్నాడు. అయితే షకలక శంకర్ భిక్షాటన చేస్తుంది ఏదో సినిమా షూటింగ్ కోసం అనుకుంటే మాత్రం పొరబాటే… పేదలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన శకలక శంకర్… కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరిస్తున్నారు.

కరోనా వైరస్ సమయంలో చితికిపోయిన 7 కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన శకలక శంకర్… ఇలా భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించారు. షకలక శంకర్ వెంట ఆయన అభిమానులు కూడా నడిచారు. ఇక ఈ బిక్షాటన లో 90 వేల వరకు సమకూరగా దానికి మరో పది వేలు కలిపి లక్ష రూపాయలతో కుటుంబాలకు సహాయం చేస్తాను అంటూ షకలక శంకర్ తెలిపారు. కాగా నిరుపేదలకు సహాయం చేసేందుకు కదిలిన శకలక శంకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖులు.