తడి బట్టల నుండి వాసన వస్తోందా..? అయితే ఇలా చేయండి..!

-

మనం ఎక్కడికైనా ముఖ్యమైన పని ఉండి వెళ్లాలంటే టక్కున మనం బట్టల్ని తీసి వేసుకుంటూ ఉంటాం. వానాకాలంలో బట్టల నుండి కొంచెం ఏదో వాసన వస్తుంది. ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మనం వేసుకోవాలనుకునే బట్టల నుండి తడి వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు వాటిని మనం వేసుకోవడానికి ఇష్టపడం. ఎంత ఆరబెట్టినా కూడా ఆ తడిదనం పోదు దాని నుండి అదో రకమైన వాసన వస్తుంది పైగా తడిగా ఉండే బట్టల్లో బ్యాక్టీరియా శిలీంద్రాలు పెరుగుతాయి.

తేమ క్రిములు సూక్ష్మజీవులు పెరగడానికి ఈ తడి బట్టలు అనుకూలంగా ఉంటాయి అయితే ఉతికిన బట్టల నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ చిట్కాల్ని ట్రై చేయండి. ఇలా చేస్తే దుర్వాసన తడి బట్టల నుండి రాదు. బట్టలు ఉతికినప్పుడు కర్పూరం నీళ్లలో కలిపి బట్టల్ని ఉతికి ఆరబెడితే మంచి వాసన వస్తుంది ఎలాంటి దుర్వాసన కూడా రాదు. అలానే మీ బట్టల్లో నేప్తలేని బాల్స్ ని పెట్టండి కీటకాల నుండి బట్టలు రక్షణ పొందడమే కాదు మంచి వాసన వస్తాయి.

తడి బట్టల తేమ వల్ల దుర్వాసన వస్తున్నట్లయితే బకెట్ నీళ్లలో నిమ్మరసాన్ని వేసి కాసేపు నానబెట్టి తర్వాత బట్టల్ని ఉతకండి. బ్యాక్టీరియా పోతుంది దుర్వాసన కూడా తొలగిపోతుంది. వాన కాలంలో వాన వల్ల బట్టలు ఆరకపోతే ఫ్యాన్ గాలిలో బట్టల్ని ఆరబెట్టండి. వెంటిలేషన్ ఉన్న ప్రదేశం లో ఉతికిన బట్టల్ని పెట్టడం వలన కూడా వాసన రాదు బట్టల నుండి మంచి వాసన రావాలంటే బట్టలు ఉతికేటప్పుడు బేకింగ్ సోడా ని వాటర్ లో వేయండి ఆరకుండా బట్టల్ని మడత పెట్టేస్తే కూడా వాసన వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news