చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. అయితే ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెడితే ఆర్థిక బాధలేమి కూడా ఉండవు. దేశంలోనే దిగ్గజ బీమా రంగ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న LIC ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఈ స్కీం లో చేరితే మీరు ఏకంగా రూ. 25 లక్షలని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూద్దాం. నెలకు రూ.1200 చొప్పున కడితే చాలు. మంచిగా డబ్బులు వస్తాయి. ఎల్‌ఐసీ తీసుకు వచ్చిన స్కీమ్స్ లో జీవన్ ఆనంద్ కూడా ఒకటి.
ఈ పాలసీతో ఎన్నో రకాల లాభాలని మీరు పొందొచ్చు. భద్రత లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తంలో నగదు ని కూడా పొందవచ్చు. తక్కువ ప్రీమియంతోనే అధిక మొత్తం పొందొచ్చు. కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 50 ఏళ్ల వరకు వయస్సు వున్నవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేయచ్చు. పాలసీ టర్మ్ 15 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది.
35 సంవత్సరాల వరకు టర్మ్ ని ఎంచుకోవచ్చు. కనీసం రూ. లక్ష మొత్తానికి మీరు బీమా తీసుకోవాలి. గరిష్ట పరిమితి అయితే లేదు. 30 ఏళ్ళ వాళ్ళు 35 ఏళ్ల టర్మ్ తో రూ. 5 లక్షల మొత్తానికి బీమా పాలసీ తీసుకుంటే.. సంవత్సరానికి రూ.15 వేల వరకు ప్రీమియం పే చేయాలి. నెలకు రూ.1250 చొప్పున అవుతుందప్పుడు. రోజుకు రూ.40 సేవ్ చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ.25 లక్షల వరకు మీరు పొందవచ్చు.