ప్రజల ఆరోగ్యం ప‌ట్ల‌ కేంద్రానికి ఎంత శ్రద్ధో..! నిజంగా చిత్తశుద్ధి ఉందా..?

-

ప్రభుత్వానికి నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే.. నిజానికి అన్ని నికోటిన్ ఉత్పత్తులను ఎట్టిపరిస్థితిలోనూ.. నిర్దాక్షిణ్యంగా బ్యాన్ చేయాల్సిందే.. కానీ నిషేధం కేవలం కొన్నింటికే ఉంటే.. అప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించినట్లవుతుందా..?

శభాష్.. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో..! అసలు నేతలకు ప్రజల ఆరోగ్యంపై అంత ఆందోళన ఉండడం అంటే.. నిజంగా ఆశ్చర్యమే మరి.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వానికి ప్రజల గురించి చింత నెలకొందంటే.. అందుకు మనం నిజంగా పాలకులను మెచ్చుకోవాల్సిందే.. అవును.. ఎందుకంటారా..? కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్లను బ్యాన్ చేసింది కదా మరి.. అందుకే ఈ పొగడ్త. అయితే అది కరెక్టే.. కానీ.. ఇంకేదో మరిచిపోయినట్లున్నారే.. ఏమిటబ్బా అది..?

ఆ.. గుర్తొచ్చింది.. పొగాకు ఉత్పత్తులు.. అవేనండీ.. చుట్ట, బీడీ, సిగరెట్, తంబాకు.. వగైరా.. ఇవన్నీ పొగాకు నుంచి తయారు చేసేవే కదా.. మరి వాటిని నిషేధించలేదు.. ఎందుకని..? అనే సందేహం రావడం లేదా.. వచ్చి ఉండాలే.. సరే.. ఆ విషయం పక్కన పెడితే.. పొగాకు ఏ రూపంలోనైనా ఆరోగ్యానికి హానికరమే.. అతి తక్కువ, ఎక్కువ అని కాదు.. దాని మోతాదు ఎంతైనా సరే.. దాన్ని ఎంత పరిమాణంలో తీసుకున్నా సరే.. అది విష పదార్థమే.. దాంతో మనకు నష్టమే కలుగుతుంది తప్ప.. లాభం ఏమీ ఉండదు. మరి ఈ విషయం తెలిసి అతిగా హాని చేస్తాయని చెప్పి ఇ-సిగరెట్లను, ఆ జాబితాకు చెందిన ఇతర ఎలక్ట్రానిక్ నికోటిన్ డివైస్‌లను బ్యాన్ చేయడం ఎంత వరకు సమంజసం..? ఇక్కడ హాని అంటే.. తక్కువ, ఎక్కువ అని కాదు.. హాని అంటే.. ఎంత మోతాదులోనైనా సరే.. హానే కదా.. అందులోనూ మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కనుక.. అవి ఏ మేర హాని కలిగించినా.. మనకు హాని కలిగించే పదార్థాలను కచ్చితంగా నిషేధించాల్సిందే.. ఏమంటారు.. కరెక్టే కదా..!

ఇ-సిగరెట్లు, పైన తెలిపిన ఎలక్ట్రానిక్ నికోటిన్ డివైస్‌లను యువత ఎక్కువగా వాడుతున్నారని, సాధారణ సిగరెట్ల కన్నా ఆ ఎలక్ట్రానిక్ నికోటిన్ డివైస్‌లే మన ఆరోగ్యానికి ఎక్కువగా హాని కలిగిస్తాయని చెబుతూ వాటిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బ్యాన్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ పరికరాలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజల ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ చూపిస్తూ వాటిని బ్యాన్ చేశారు.. బాగానే ఉంది.. కానీ అలా అని చెప్పి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులతో హాని ఉండదా.. అంటే.. కచ్చితంగా ఉంటుంది.. వాటి వల్ల కూడా మన ఆరోగ్యానికి నష్టం బాగానే కలుగుతుంది. కానీ ఎలక్ట్రానిక్ నికోటిన్ డివైస్‌లను మాత్రమే బ్యాన్ చేసి సాధారణ పొగాకు ఉత్పత్తులను బ్యాన్ చేయకపోవడం వెనుక ప్రభుత్వం ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు.

ప్రభుత్వానికి నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే.. నిజానికి అన్ని నికోటిన్ ఉత్పత్తులను ఎట్టిపరిస్థితిలోనూ.. నిర్దాక్షిణ్యంగా బ్యాన్ చేయాల్సిందే.. కానీ నిషేధం కేవలం కొన్నింటికే ఉంటే.. అప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించినట్లవుతుందా..? ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ర‌క్షించేందుకే ఆయా ఉత్ప‌త్తుల‌ను నిషేధిస్తున్నామ‌ని చెప్ప‌డంలో అర్థం ఉంటుందా..? ఇలాంటి స‌గం స‌గం నిర్ణ‌యాల‌కు జ‌నాలు న‌వ్వ‌రా..? ఆలోచించ‌రా..? దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలి. ఇలాంటి తలాతోక లేని నిర్ణయాల వల్ల సమస్య అలాగే ఉంటుంది కానీ.. అది పూర్తిగా పరిష్కారం కాదు. ఇప్పటికైనా.. పాలకులు ఆలోచించి.. 100 శాతం ప్రజల ఆరోగ్యం కోరుకునే వారే అయితే.. అన్ని పొగాలకు ఉత్పత్తులను (అవి ఎలక్ట్రానిక్ అయినా, ఇతర రూపంలో ఉన్నా సరే) కచ్చితంగా నిషేధించాలి. లేదంటే.. ప్రజలందరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అభాసుపాలు కావల్సివస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version