కన్నీరు ద్వారా కరోనా వ్యాపిస్తుందా? తెలుసుకోవాల్సిన విషయాలు..

-

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉంది. కొత్త వేరియంట్లు వ్యాక్సిన్లకే సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా గురించిన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కన్నీరు ద్వారా కూడా వస్తుందా అనేదానికి సమాధానం దొరికింది. ఈ విషయమై ఎన్నో రోజులుగా పరిశోధనలు చేస్తునే ఉన్నారు. అమృత్ సర్ కి చెందిన ప్రభుత్వ వైద్యాలయ వైద్యులు పరిశోధించిన ప్రకారం, కంటి నీరు ద్వారా కరోనా వ్యాపిస్తుందని తేలింది.

ఈ పరిశోధన ప్రకారం మొత్తం శాంపిళ్ళలో 17.5శాతం మాత్రమే కంటి నీటి ద్వారా కరోనాకు గురయ్యారని తేలింది. కళ్ళ డాక్టర్లు, కంటి పరీక్షలు చేసే నిపుణులు, మేకప్ వేసేవారు, సెలూన్ మొదలగు వారంతా కంటి నీటి ద్వారా కరోనా సోకే ప్రమాదానికి దగ్గరలో ఉండే అవకాశం ఉందని చెప్పారు.

కన్నీరు ద్వారా కరోనా సోకడానికి మార్గాలు

కరోనా సోకిన వారి కన్నీళ్ళు ఉపరితలంపై పడ్డప్పుడు, అవి ఇతరులు టచ్ చేసినపుడు కరోనా సోకే ప్రమాదం ఉంది. ఇంకా, వైరస్ ఉన్న ఉపరితలాన్ని ముట్టుకుని, అదే చేతులతో కళ్ళను ముట్టుకున్నప్పుడు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంది.

కన్నీరు ద్వారా కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీకు కోవిడ్ సోకినట్లయితే కళ్ళని రుద్దకుండా ఉండండి. దానివల్ల ఇతరులకు సోకే ప్రమాదం కొద్దిగానైనా తగ్గుతుంది.

కళ్ళని తుడుచుకున్న టిష్యూలను డస్ట్ బిన్ లో పడేయండి.

ఒకవేళ కళ్ళను ముట్టుకున్నట్లయితే వెంటనే సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోండి. సబ్బు అందుబాటులో లేనట్లయితే శానిటైజర్ వాడండి. ఆ శానిటైజర్ లో 60శాతం ఆల్కహాల్ ఉండేలా చూసుకోండి.

కరోనా వ్యాధిగ్రస్తులు మీ చుట్టూరా ఉన్నప్పుడు కళ్ళని ముట్టుకోవడం మానేయండి.

మీరు ముట్టుకునే ఉపరితలాలను తరచుగా శుభ్రం చేస్తూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version