ప్రపంచం వ్యాప్తంగా ఎక్కువ ఫెమస్ అయిన ఫుడ్ లలో పిజ్జా కూడా ఒకటి..పిజ్జాలో మంచి ఫ్లేవర్స్, అధిక మోతదులో చీజ్ ఉంటుంది.. అందుకే రుచి కూడా వేరే లెవెల్ అని చెప్పాలి.నిజంగా పిజ్జా పేరు వింటేనే చాలా మందికి నోరు ఊరిపోతుంది కదా.. ఈ ఇటాలియన్ వంటకం బాగా ప్రాచుర్యం పొందింది. ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటారు. ఇది తినడం వల్ల బరువు పెరగడం, కొవ్వు చేరిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.
ఇక నుంచి బరువు తగ్గే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇలా పిజ్జాని తింటే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. పైగా బరువు తగ్గుతారు కూడా. అదెలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పిజ్జాను బరువు తగ్గించే ఆహారంలో భాగంగా మార్చుకోవడానికి ఆరోగ్యకరమైన పదార్థాలను ఎంచుకోవడం. పిజ్జా తయారీకి మైదా పిండికి బదులుగా గోధుమ పిండి ఉపయోగించడం. ఇందులో ఫైబర్, పోషకాలు ఉన్నాయి. అలాగే పిజ్జా మీద బెల్ పెప్పర్స్, పుట్ట గొడుగులు, ఉల్లిపాయలు, బచ్చలికూర, టొమాటోలు వంటి కూరగాయలు జోడించుకోవచ్చు. ఇవన్నీ బరువు తగ్గించేందుకు దోహదపడే ఆహార పదార్థాలు. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే కేలరీల సంఖ్య తక్కువగా ఉంచుతుంది..
పిజ్జాను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.. అంతే విధంగా వ్యాయామాలు కూడా చేసుకోవాలి..పిజ్జాలో అతిగా చీజ్ వేసుకుని లాగించేయకూడదు. దాన్ని అతిగా తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.బరువు తగ్గాలని ప్లాన్ వేసుకున్నపుడు ఇష్టమైన ఆహారాలను కూడా వదిలేసుకుంటారు. కానీ అలా చేయడం వల్ల వాటిని తినాలనే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం ఇతర పదార్థాల మీద చూపించేస్తారు. పరిమితికి మించి తినేస్తుంటారు. అలా చేస్తే బరువు తగ్గడం అటుంచి తెలియకుండా బరువు పెరిగిపోతారు. అందుకే నచ్చిన పదార్థాలు మితంగా తీసుకుంటూ కూడా బరువుని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.. చూసారుగా పిజ్జా ప్రియులు మీ ఇష్టాన్ని పక్కన పెట్టకుండా ఇలా ట్రై చెయ్యండి..