స్మార్ట్ ఫోన్ వాడకం పిల్లల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుందా?

-

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టైమ్ కారణంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందనేది నిపుణుల వాదన. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ అందించకుండా చేయడం కష్టమైపోతుంది. చాలాసార్లు ఫోన్లు లాగేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఏడవడం, కోపంతో వస్తువులు విసిరివేయడం చేస్తుంటారు. అలాంటప్పుడు స్క్రీన్ టైమ్ తగ్గించడం ఇంకా కష్టంగా మారుతుంది. ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూస్తుంటే వచ్చే అనర్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మనసు మళ్ళించడం

ఒక పని మీద నుండి మనసు మళ్ళించడంలో స్మార్ట్ ఫోన్లు ముందుంటాయి. బాల్యంలో పిల్లల మెదడు అభివృద్ధి చెందే సమయం. అలాంటప్పుడు అనవసర విషయాలు అందులో చేరి మనసు మళ్ళించి మెదడు పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువ

నీలికాంతి

తెర నుండి వచ్చే నీలికాంతి కేవలం కళ్ళకే కాదు మెదడు కణాలకు కూడా హానికరమే. దానివల్ల ఒకే పని మీద దృష్టి నిలపడం అసాధ్యం అవుతుంది. రాత్రిపూట ఫోన్ వాడే చాలామందిలో అలసట, బలహీనత ఏర్పడడానికి నీలికాంతి కూడా ఓ కారణమే.

డిజిటల్ అమ్నీషియా

ప్రతీ సంఘటన అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్లకు ఒకానొక దశలో నిజజీవితంలో జరిగే సంఘటనలు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది.

పరిష్కారాలు

పిల్లలు ఎంతసేఫు ఫోన్ వాడుతున్నారనేది పెద్దలు గమనిస్తూ ఉండాలి. మెసేజ్ చేస్తున్నారా? లేక కాల్స్ మాట్లాడుతున్నారా? ఎంతసేపు మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలి.

పిల్లలకి ఆన్ లైన్ క్లాసులు ఉన్నట్లయితే కళ్ళకి రక్షణ ఇచ్చే అద్దాలు తీసుకురావాలి. ఆన్ లైన్ క్లాసులకి తప్ప మిగతా పనులకి ఫోన్లని చేతికి ఇవ్వకూడదు. అదే కాదు ఏదైనా శారీరక శ్రమ కలిగించే ఆటల్లో భాగస్వాములని చేయాలి.

లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడేలా ప్రోత్సహించాలి. అలాగే చెవికి దగ్గరగా పెట్టుకోవద్దని సూచించాలి.

రాత్రిపూట ఫోన్ అస్సలు ముట్టుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version