తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ సందర్బంగా ప్రధాని మోడీ ఫొటో పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేయగా.. కేంద్రం దొడ్డు బియ్యం ఇస్తోందని, సన్న బియ్యం ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రమే ఇస్తుందని బండి సంజయ్ వెల్లడించారు.
కేంద్రంలోని మోడీ ఇస్తున్న బియం వద్దని లేఖ రాసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.కిలోకు రూ.37 ఇస్తున్న ప్రధాని మోడీ గొప్పనా? లేక రూ.10 ఇస్తున్న రేవంత్ రెడ్డి గొప్పనా? అని ప్రశ్నించారు. ప్రతి పేదకు రూ.37లు ఖర్చు పెట్టి మోదీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంటే,కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టకపోవడం దారుణం అన్నారు. ఇన్నాళ్లు సన్న బియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీపై ధ్వజెమత్తారు. ఆదివారం కరీంనగర్‌లోని జూబ్లీనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గావ్ చలో’ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ‘మోడీ పాలన మరువొద్దు.. బీజేపీని విడువొద్’దు అనే నినాదం ఇచ్చారు.