హార్సిలీ హిల్స్‌లో నిర్వహించిన టీడీపీ సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశం జరుగుతున్న సందర్భంగా తంబల్లపల్లి ఇన్‌చార్జి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు గొడవపడినట్టు తెలుస్తోంది. జిల్లా మంత్రులు ఎంత చెప్పినా ఇరువురు వినిపించుకోలేదని సమాచారం.
దీంతో సమావేశం మధ్యలో నుంచి ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి,పార్టీ అబ్జర్వర్ దీపక్ రెడ్డి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. గొడవను సర్ది చెప్పలేక మంత్రులు సమావేశం నుంచి వెళ్లిపోగా.. బయటకూడా తంబల్లపల్లి, మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయుల మధ్య గొడవ కాస్త ముదిరి బయట కూడా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. కాగా, దీనిపై టీడీపీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.