మంత్రి వర్గ విస్తరణ పై అటు అధికార పార్టీలోనూ.. ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవీ రాకుండా ఢిల్లీ స్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. ఈ విషయంలో ధర్మరాజుల ఉండాల్సిన సొంత జిల్లా నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడని.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు మంత్రి ఖాయమైనా.. కావాలనే జానారెడ్డి పదే పదే అడ్డుపడుతున్నారని మండి పడ్డారు. 25 సంవత్సరాలు మంత్రి పదవీలో ఉన్నది జానారెడ్డికి సరిపోదా..? అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవీ ఇస్తే.. దానిని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవీ కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పు ఏంటి..? అని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలన్నారు.