కప్పకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

-

ఈ భూ ప్రపంచం ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని వింతలు జనాలను ఆకర్షిస్తున్నాయి. దేవుళ్ళకు గుడి కట్టించడం ఒక ఎత్తు..కానీ జంతువులకు కూడా దేవాలయాలు ఉన్నాయి.అవి ఎక్కడ ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మనదేశంలో భక్తి రోజురోజుకు కొత్త రూపులు తొక్కుతుంది. ఎంతలా అంటే.. అవసరమైతే ఆలయాలను కట్టేంత. దేవుళ్లకు గుళ్లు కడితే ఫర్వాలేదు.. కానీ ఇష్టమైన హీరోయిన్లు, రాజకీయ నాయకులు అంటూ రోజురోజుకో గుడిని నిర్మిస్తున్నారు. అంతే కాదండోయ్ కొన్ని చోట్లయితే ఇతర జీవులైన కప్ప, దోమ, ఎలుక ఆఖరుకు గబ్బిళానికి కూడా ఆలయాలు నిర్మిస్తున్నారు. జంతువులకు గుళ్లు ఏంటని ఆశ్చర్య పోనక్కర్లేదు. భయం-భక్తి ఉన్న మనుషులు ఈ రెండింటి కోసం ఎవ్వరికైన ఆలయాలు కట్టేస్తారు. మరి ఇంత వింత విచిత్రమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చుద్దాము రండి..

దోమకు గుడి ఏంటని వినడానికి మనకు కొంచెం విచిత్రంగా, హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం. ఇంతకీ ఈ గుడి ఎక్కడో లేదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. హైదరాబాద్ పరిసరప్రాంతంలో దీనిని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఓ డాక్టర్ నిర్మించారు. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహాన కల్లించాలనే సదుద్దేశ్యంతో ఎం. సతీశ్ రెడ్డి అనే వైద్యుడు దోమ ఆలయానికి కట్టారు..

ఇకపోతే బిహార్ లోని వైశాలీ జిల్లాలోని ఈ గుడి ఉంది. ఈ ప్రాంతం పాట్నా, ముజఫర్ పుర్ కు మధ్యలో ఉంటుంది. గబ్బిళాలు ఎలాంటి హానికారకాలు కావని అక్కడున్న స్థానికులు గట్టిగా విశ్వసిస్తుంటారు. గబ్బిళాలకు ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ ఆక్కుడున్న గ్రామస్థులు గబ్బిళాల వల్లే తామంత సురక్షితంగా ఉన్నామని అక్కడి వాళ్ళు నమ్ముతారు..

రాజస్థాన్ లోని బికనీర్ లో కర్ణి మాత గుడి ఉంది. ఈ ఆలయం ఎలుకలకు ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిని చుంచెలుక కోసం నిర్మించారు. ఆ దేవాలయానికి వచ్చే భక్తులు చుంచెలకకు పూజలు చేయాలని ఉద్దేశ్యంతో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా అక్కడకొచ్చే భక్తులు చుంచెలకలను దేవుడులా భావించి బహుమతులు కూడా అందజేస్తుంటారు.. ఆ ఎలుకకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు..

ఇకపోతే ఆకరిది కప్ప దేవాలయం..ఉత్తర ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ జిల్లాకు చెందిన ఆయల్ లో కప్పకు ఆలయం నిర్మించారు. దేశంలో కప్ప గుడి ఉన్న ఏకైక ఆలయం ఇది. ఇక్కడ కప్పలను పూజిస్తారు. మండూక తంత్రం ఆధారంగా ఈ గుడిలో శివాజీ కప్ప వెనకు భాగంలో కూర్చొని ఉంటారని అక్కడ ప్రజలు చెబుతారు. 200 ఏళ్ల నుంచి ఉన్న కప్ప మందిరాన్ని వరదలు, కరువు కటాకాలు నుంచి బయట పడేందుకు గాను నిర్మించారు. సాధారణంగా వర్షాలు పడకపోతే కప్పలను పూజిస్తారనే విషయం అందరికి తెలిసిందే.ఈ కప్ప దేవాలయంలో శివ లింగం కూడా ఉంది.. ఆ లింగం రంగులు కూడా మారుతుంది..ఇది నిజంగా విచిత్రమే..

Read more RELATED
Recommended to you

Exit mobile version