తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి పాలు తాగిన పిల్లలకు వైరస్ ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని గుర్తించారు. పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఫలితాలను పెన్సిల్వేనియాలోని ఒక పత్రికలో ప్రచురించారు. తల్లి పాలు తాగిన పిల్లలు వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటారని గుర్తించారు.
జీర్ణశయాంతర రుగ్మతల నివారణకు తల్లి పాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తల్లి పాలు తాగిన పిల్లలకు నెల రోజుల్లోనే ఒక రకమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందిందని… వైరస్ ల సంఖ్య క్రమంగా ఆ బ్యాక్టీరియా చంపేసింది అని గుర్తించారు. దీనికి కారణం తల్లి పాలే అని గుర్తించారు. వ్యాధి కారక వైరస్ లను తల్లి పాలలో ఉండే ఒక రకమైన బ్యాక్టీరియా చంపేసింది అని పేర్కొన్నారు. తల్లి పాలు తాగిన వారికి రక్షణ ఎక్కువగా ఉందని గుర్తించారు.
యుఎస్ మరియు బోట్స్వానా నుండి వచ్చిన శిశువులలో ఈ లక్షణాలు గుర్తించారు. అంటు వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తల్లి పాలు పిల్లల పెరుగుదలను బాగా ప్రభావితం చేస్తాయని, వారిలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని వివరించారు. అనారోగ్యాలతో పాటుగా సుధీర్గ కాలం వేధించే ఆరోగ్య సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అన్నారు.