కుటుంబానికి సోకిన కరోనా.. కుక్కకూ వ్యాపించింది..

-

కరోనా వైరస్‌ కేవలం మనుషులకు మాత్రమే సోకుతుందని, పెంపుడు జంతువులకు సోకే అవకాశం లేదని ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలువురు సైంటిస్టులు కూడా చెబుతూ వచ్చారు. అయితే అది అబద్దమని తేలింది. తాజాగా అమెరికాలో ఓ కుక్కకు కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. అమెరికాలోని జార్జియాలో ఓ కుటుంబానికి కరోనా సోకింది. వారి నుంచి ఆ వైరస్‌ వారు పెంచుకునే తమ పెంపుడు కుక్కకు కూడా వ్యాపించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు నిర్దారించారు.

ఆ కుక్క వయస్సు 6 ఏళ్లు ఉంటుందని.. అది మిక్స్‌డ్‌ బ్రీడ్‌ అని జార్జియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ కుక్క ఉన్న కుటుంబానికి కరోనా సోకడం వల్లే ఆ కుక్కకు కరోనా వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే ఆ శునకానికి నాడీ సంబంధ సమస్యలు ఉన్నాయని, కానీ అవి కరోనా వల్ల వచ్చాయా, అంతకు ముందే ఉన్నాయా.. అన్నది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇక గతంలో ఇదే విషయంపై సైంటిస్టులు పెంపుడు జంతువులపై ప్రయోగాలు కూడా చేశారు. కుక్కలు, పిల్లలకు కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేల్చారు. అయితే తాజాగా చోటు చేసుకున్న సంఘటనతో జనాలు ఉలిక్కిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version