కుక్కకు హెల్మెట్ పెట్టి మ‌రీ తీసుకెళ్లిన ద్విచక్రవాహనదారుడు: వైర‌ల్ వీడియో

-

సాధార‌ణంగా చాలా మంది హెల్మెట్ పెట్టుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే దాన్ని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ హెల్మెట్ లేక‌పోవ‌డం వ‌ల్లే అనేక మంది యాక్సిడెంట్స్‌లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తుంటారు. అయినా కానీ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు కొంద‌రు. అటువంటిది తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్తోన్న సమయంలో తాను హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా తన వెనుక కూర్చున్న కుక్కకు కూడా హెల్మెట్ పెట్టాడు.

తాను పెంచుకుంటోన్న కుక్కకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఆ ద్విచక్ర వాహనదారుడు తీసుకున్న జాగ్రత్తలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్ర‌స్తుతం శునకం హెల్మెట్‌ ధరించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసైనా హెల్మెట్ పెట్టుకోని వారు మారతారని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. మ‌రి ఆ వీడియో మీరు చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version