మనం రోజు తెలిసి తెలియక చేసే కొన్ని పనుల వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం అవుతుంటాయి. అయితే వాటి ప్రభావం టీవీ యాడ్స్ లో రిజల్ట్ లాగా అప్పుడే కనిపించదు..డైలీ సీరియల్ లా సాగిదీసి.. ఎఫెక్ట్ ఎప్పటికో చూపిస్తుంది. అందులో మనలో చాలా మంది భోజనం చేశాక నిద్రపోవటం, ఈతకొట్టటం, వ్యాయామం చేయటం, స్నానం చేయటం వంటివి చేస్తుంటారు. ఇవే మనకొంప ముంచుతాయట. వీటిని ఎందుకు తిన్న తర్వాత ఈ పనులు వైద్య నిపుణులు ఎందుకు వద్దంటున్నారో ఇప్పుడు చూద్దాం.
2.ఈత కొట్టొద్దు: తిన్న వెంటనే ఈత కొట్టడం చాలా ప్రమాదకరం. దీని ద్వారా కడుపు తిమ్మిరికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.. కానీ కొందరు తిన్న తర్వాత ఈత కొడితే జీర్ణక్రియ భాగా పనిచేస్తుందని అంటుంటారు. అయితే ఈతకు జీర్ణక్రియకు సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.
3. నిద్రపోతే ఇక అంతే: మనలో చాలా మందికి తిన్న వెంటనే ఓ కునుకు వేయాలనిపిస్తది. కడుపునిండా తిన్న తర్వాత..కంటి నిండా పోతే బానే ఉంటుంది కానీ ఇది అత్యంత ప్రయాదకరం. తిన్న తర్వాతే నిద్రపోవటం అంటే ఊబకాయానికి బాటలు వేసినట్టే. అంతేగాక గుండెల్లో మంట, ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట. తిన్న తర్వాత కనీసం రెండు గంటలైనా వేచి ఉండాలని.. అప్పుడే నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
5. బెల్ట్ పెట్టుకోవద్దు: చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీసుల్లో లంచ్ చేసేటపుడు బెల్ట్ పెట్టుకునే భోజనం కానించేస్తారు. కానీ అలా చేయకూడటం తప్పు అని వైద్యులు అంటున్నారు. తినేటపుడు కడుపును నిర్బందిస్తే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయట. కొంచెం ఇబ్బంది అయినా సరే..ముఖ్యంగా పురుషులు తినే సమయంలో బెల్ట్ ను వదులు చేసుకోవడం, లేదా పూర్తిగా తీసేయడం ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదండి…ఈ పనులు చేసే అలవాటు మీకు ఉంటే..వెంటనే వదిలించుకోవటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నిద్రపోవటం..దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుయాని వైద్యులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు.