క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే ఎంతో పుణ్యమట..!

-

కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో ఎంత మంచి చేస్తే అంత పుణ్యం వస్తుంది. చాలా విశిష్టమైన ఈ కార్తీకమాసం లో వచ్చే ద్వాదశి నాడు ఈ పనులు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందిట. మరి వాటి కోసమే మనం ఇప్పుడు చూద్దాం.

కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశీ క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికి ఉసిరికి వివాహం జరుపుతారు. లక్ష్మీ స్వరూపమైన తులసి కోట కి చుట్టూ దీపాలతో అందంగా అలంకరిస్తారు. అలానే పూజలు చేసి పుణ్యం పొందుతారు. యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశ నాడు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడని అంటారు. క్షీరాబ్ది ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు.

క్షీరాబ్ది ద్వాదశి నాడు చేయవలసిన పనులు:

క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపాలను వెలిగిస్తే చాలా మంచి కలుగుతుంది ఏ రోజైనా దీపారాధన చేయకపోతే కలిగిన దోషం ఈరోజు దీపారాధన చేయడం వలన తొలగిపోయి శుభం కలుగుతుంది అని పండితులు అంటున్నారు.
క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి, విష్ణుమూర్తికి పూజలు చేస్తే సుఖసంపదలు ఐశ్వర్యం కలుగుతాయి.
తులసి కోటను అలంకరించి చక్కగా పూజలు చెయ్యాలి. తులసి కోట ఎదుట వరిపిండితో పద్మం వేస్తె మంచిది. తులసి కూడా చుట్టూ పక్కల కూడా శుభ్రంగా ఉండాలి.
చాలా మంది క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరికాయ లో దీపాలను పెడుతుంటారు.
ఈరోజున 27 దీపాలను వెలిగిస్తే మంచిదట.
అలానే దీపాలను ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిది.
తులసి కోట లో ఉసిరి కొమ్మను కూడా పెట్టి పూజ చేస్తే మంచిది. కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news