యెమెన్‌లో హౌతీల భేటీ.. ఇలా లేపేసామన్న డొనాల్డ్ ట్రంప్

-

యెమెన్ దేశంలో హౌతీ ఉగ్రవాదులు సమావేశం అయ్యారన్న విషయం తెలియడంతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారి వైమానిక దాడులు చేసిట్టింది. డ్రోన్ ద్వారా బాంబు దాడులు జరిపి వారిని హతమార్చింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు.

‘హూతీలను ఇలా హతమార్చాం’ అంటూ ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే, హౌతీలు అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడి చేసేందుకే సిద్ధమయ్యారని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలోనే వారు ఇలాంటి దాడులకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వారిని హతమార్చామని ట్రంప్ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news