బాబూ జగ్జీవన్ రామ్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి..!

-

మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళిలు అర్పించారు. డా.బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 118వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని బషీర్ బాగ్ లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

CM Revanth Reddy pays tribute to former Deputy Prime Minister Dr. Babu Jagjivan Ram

అటు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సేవలను స్మరించుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కృషి ఆదర్శనీయం అన్నారు. సమ సమాజం కోసం మనందరం పనిచేయడమే వారికి అందించే ఘన నివాళి అర్పించారు. స్వాతంత్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని కేసీఆర్ కొనియాడారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news