లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో ఆశలు వద్దు…!

-

మన వాళ్లకు అవకాశం దొరికితే చెలరేగిపోతు ఉంటారు. జనతా కర్ఫ్యూ ని ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాటించి సాయంత్రం అన్నం తినే కంచాలు, స్పూన్ లు ప్లేట్స్ పట్టుకుని రోడ్ల మీదకు వచ్చి ఐఖ్యతను బలంగా చాటారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. లాక్ డౌన్ ఎత్తివేస్తే…

కేసీఆర్ చెప్పినట్టు మాస్ గేధరింగ్ జరిగే అవకాశం ఉంది. బార్స్, పబ్బులు, సినిమా హాల్స్, ఇలా ప్రతీ ఒక్కటి తెరిస్తే జనాలు అందరూ కూడా గుమిగూడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా కరోనా చాలా వరకు కట్టడిలోనే ఉంది. రాబోయే 7 రోజులు కీలకంగా మారాయి. ఇంకా ఈ ఏడు రోజుల్లో కరోనా కట్టడి అవ్వకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కరోనా కట్టడి అవ్వాలి.

కరోనా లక్షణాలు బయటపడాలంటే 14 రోజుల సమయం పడుతుంది. లాక్ డౌన్ ముగిసే 14వ తేదీలోపు దేశంలో కరోనా ప్రభావం ఎంత అన్నది ఒక అంచనాకు వచ్చి అప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. గ్రామాల్లోకి కొత్తవారిని రానివ్వకుండా కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు లాక్ డౌన్ ఉంచుతారా లేదా అనేది తెలియదు. కాని ఏడు రాష్ట్రాల్లో మాత్రం లాక్ డౌన్ సడలించే అవకాశం లేదు. ఏపీ, తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ లో కరోనా ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version