దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు బెట్టింగ్ యాప్స్ వాడకం వలన చాలా మంది అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటి వలన క్రైమ్ రేటు సైతం పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి బెట్టింగ్ యాపుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మంగళశారం ‘ఎక్స్’వేదికగా ఓ వీడియోను పోస్టు చేసిన ఆయన ప్రజలను హెచ్చరించారు.
‘వామ్మో..! రూ.వెయ్యి పెట్టుబడికి చిటికెలో రూ.లక్ష రాబడా? అంటే 99 రెట్లు లాభమా?! ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా? అసలు అంటూ సంబంధిత వీడియోను పోస్టు చేశారు. వీడియోలో ఓ వ్యక్తి బెడ్లో నోట్ల కట్టలు పరుస్తూ బెట్టింగ్ యాపులను ప్రమోషన్ చేస్తున్నాడు. ఇలాంటి వాటి వెనుక మీరు పడొద్దని సజ్జనార్ సూచనలు చేశారు. మీ కంట పడే ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఏరి కోరి ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడకండని.. జీవితాలను చిద్రం చేసుకోకండని హితవు పలికారు. ఆశ ఉండొచ్చు తప్పులేదని..అత్యాశ, దురాశ ఉంటే మీకు చివరికి బాధ, దుఃఖమే మిగులుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.