ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ తరుణంలోనే తీర్పు రాగానే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఫార్ములా ఈ రేసుతో సంబంధం ఉన్న గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో ఏక కాలంలో రికార్డులను పరిశీలిస్తున్నారు.
మాదాపూర్ లోని ఏస్ నెక్ట్స్ జెన్, ఏస్ అర్బన్ రేస్, మచిలిపట్నంలోని ఏస్ అర్భన్ డెవలపర్స్ కార్యాలయాల్లో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఇవాళ గ్రీన్ కో కంపెనీ, దాని అనుబంధ సంస్థలో సోదాలు పూర్తి చేసి పక్కా ఆధారాలతో ఈనెల 09న కేటీఆర్ ను విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఇటీవలే ప్రభుత్వం ఆరోపించింది.