ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక అధికారం కోసం చాలా మంది అర్రులు చాస్తున్నారు. అందులో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొందరు అధికారం కోసం తన మరణం కోరుకుంటున్నారని ఆరోపించారు.తన మరణం కోరుకుంటూ బై-ఎలక్షన్‌లో గెలవాలని కొందరు భావిస్తున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.”నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నా మరణంతో మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను, కానీ నేను ఉండగానే చనిపోవాలని కోరవద్దు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియాల్సి ఉన్నది.