గ్రూప్-1 పోస్టుల భర్తీపై టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్‌షాక్

-

గ్రూప్ -1 పోస్టుల భర్తీ విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్‌షాక్ తగిలింది.రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాల విషయంలో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌ను సీజే బెంచ్ డిస్పోజ్ చేసింది.

కాగా, గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజశ్వరరావు ధర్మాసనం నియామకాలకు తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, ధ్రువపత్రాల పరిశీలన మాత్రం చేసుకోవచ్చని అవకాశం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news