టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివసరావు వైసీపీలో చేరే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఈ నెల 9 న ఆయన పార్టీ మరే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే ఆయనను పార్టీలోకి తీసుకోవద్దు అని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గంటా వైసిపిలో చేరిక వార్తల పై భీమిలి నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తల నిరసన వ్యక్తం చేసారు.
పద్మనాభం మండలం చిన్నాపురంలో భారీగా నిరసనలకు దిగిన వైసిపి, గతంలో జగన్ పాదయాత్ర సమయంలో గంటా ఇదే గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని బలవంతంగా తొలిగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తిరిగి ఏ విధంగా వైసిపిలో చేరతారని వైసిపి వర్గాల గంటా పై ఆగ్రహ౦ వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్దితిలో గంటాను వైసిపిలోకి తీసుకోవద్దని జగన్ కు వైసిపి క్యాడర్ విజ్ఞప్తి చేసింది. భీమిలి నుంచి మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా గంటా చేరికను వ్యతిరేకిస్తున్నారు.