మిమ్మల్ని పట్టించుకోని వారి వెనుక తిరగద్దు.. బదులుగా ఇలా చెయ్యండి..!

-

మనం ఇష్టపడే ప్రతి ఒక్కరూ మనల్ని ఇష్టపడాలని ఎలాంటి నియమం లేదు. చాలా మంది మొదట ఇష్టపడి తిరిగి వాళ్ళు కూడా వాళ్ళని ఇష్టపడాలని వాళ్ళని పట్టుకుని వేలాడుతూ ఉంటారు కానీ నిజానికి మీరు అలా వాళ్ళ వెనకాల తిరిగినప్పటికీ వాళ్ళు అసలు మిమ్మల్ని పట్టించుకోరు కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులకు ఇష్టం లేకుండా వాళ్ళని ఇష్టపడడం వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా వాళ్ళు వెనకాల తిరగడం వంటి తప్పులను చేయకండి.

వారికి కూడా కొంత స్పేస్ ఇవ్వాలి. ఆ సమయంలో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకవేళ కనుక వాళ్ళకి మీతో ఉండాలి అనిపిస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు కాబట్టి పదే పదే వారి వెనక తిరిగి ఇబ్బంది పెట్టకండి.

ఒకవేళ కనుక ఎక్కువ సమయం ఇచ్చినప్పటికీ తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాకపోతే కాస్త వారికి మీరు ఉన్నారు అని గుర్తు చేసినట్లుగా మాట్లాడి ప్రయత్నం చేయండి అయినప్పటికీ వాళ్ళు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లయితే వారికి మీరు ఇష్టం లేదని మీకే క్లియర్ గా అర్థమైపోతుంది.

ఇతరులకి మీరు నచ్చలేదంటే ఖాళీగా వున్నా బిజీగా ఉన్నానని చెప్తూ ఉంటారు అలానే మీతో అస్సలు మాట్లాడడానికి ఇష్టపడరు. ఒత్తిడి వలన కూడా చాలా మంది పట్టించుకోకుండా ఉంటారు ఒకవేళ కనుక వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు ఏమో చూడండి లేదంటే వారికి ఏమైనా సమస్యలు కలిగి దాని వలన మీకు దూరంగా ఉంటున్నారేమో గ్రహించండి.

ఒక్కొక్కసారి కొంతమంది డబ్బు, పేరు వచ్చిన తర్వాత దూరం పెడుతూ ఉంటారు అలా కనుక మిమ్మల్ని దూరం పెడుతున్నట్లయితే మీరు దానిని గ్రహించి వారికి దూరంగా ఉండటమే మంచిది. నిజానికి మీరు మొదట కరెక్ట్ గా ఉండండి అప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేసే వారి కంటే మంచి వాళ్ళు వస్తారు ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు ఎలా రోజులు వస్తూపోతున్నాయో మనుషులు కూడా వస్తూపోతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించి మీకు ఉండే సమయాన్ని మీరు అనవసరంగా వృధా చేసుకోకండి మీ బంగారు భవిష్యత్తుని మీరే చక్కగా మీ చేతులతో తీర్చిదిద్దుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version