హైదరాబాద్ లో ఇక ఎలక్ట్రిక్ డబుల డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రయాణికులకు అతిత్వరలోనే టీఎస్ఆర్టీసీ డబుల్ డెక్కర్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. గతేడాది 2020 నవంబర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ సార్ ఇది చూడండి. ఎవరైనా ఈ డబుల్ డెక్కర్ బస్సు గుర్తు ఉందా.. జూ పార్క్ నుంచి అఫ్జల్ గంజ్, హైకోర్టు మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లేదని కోసం దీన్ని మళ్లీ ప్రారంభించండని డబుల్ డెక్కర్ బస్సు ఫొటో షేరు చేశారు. ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు.
ముందుగా నగరంలోని పర్యాటక స్థలాలను సందర్శించేందుకు వీలుగా కొన్ని బస్సులను అందుబాటులోకి తేవాలనుకున్నప్పటికీ.. నేడు ఆ సంఖ్య భారీగా పెరిగింది. 500 ఎలక్ట్రిక్ బస్సులకుగానూ అశోక్ లేల్యాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో ఈ బస్సులు భాగ్యనగర రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి.