ఎస్బీఐ బ్యాంకులో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం చోరీ

-

ఇళ్లల్లో దాచుకున్న బంగారానికి భద్రత ఉండటం లేదని బ్యాంకులో దాచుకున్న వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు లాకర్లో భద్రపరిచిన బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్‌తో కిటికీని కట్ చేసిన దొంగలు బ్యాంక్ లోపలికి ప్రవేశించారు.

ఈ ఘటనలో బ్యాంకులో నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే బంగారం చోరీకి గురైనట్లు ఎస్బీఐ అధికారులు గుర్తించారు.
అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులో వేలిముద్రలు ఏమైనా దొరుకుతాయని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతరాష్ట్ర దొంగల ముఠా ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతోంది. ఇది కూడా వారి పనేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version