టోల్‌గేట్ల వద్ద రద్దీ నియంత్రణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అద్దం పై ‘ఫాస్టాగ్’ను అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది.ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్‌ను ఉద్దేశపూర్వకంగా విండ్‌స్క్రీన్‌పై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద జాప్యం ఏర్పడుతోందని, తద్వారా తోటి వాహనదారులకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొంది.
మార్గదర్శకాలివే..
ముందు అద్దంపై ఫాస్టాగ్ అతికించకుండా టోల్ దాటే వాహనాలకు విధించే జరిమానాకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ప్లాజాల ప్రవేశ మార్గాల్లో ప్రదర్శించాలి.ఫాస్టాగ్ లేని కేసుల్లో ఆ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలి.దీంతో టోల్ లైనులో వాహనం వెళ్లినట్లు నిర్దరించుకునేందుకు అవకాశం ఉంటుంది.నిబంధనల ప్రకారం ఫాస్టాగ్‌ను అతికించని వాహనాలకు రెట్టింపు టోల్ విధించడంతోపాటు బ్లాక్‌లిస్ట్‌లో వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.ఫాస్టాగ్‌లను జారీ చేసే బ్యాంకులు కూడా వాహనంపై నిర్దేశించిన చోట వాటిని అతికించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.