హార్దిక్ పాండ్యా- నటాషా విడాకులు

-

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య-నటాషా తాము విడిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ‘మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మాకు కఠినమైన నిర్ణయం. అగస్త్యకు (కుమారుడు) మంచి కో-పేరెంట్స్ గా ఉంటాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను మీరు గౌరవిస్తూ, మద్దతివ్వాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

కాగా, హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి 2020 మే 31న వివాహం చేసుకున్నారు. పార్టీలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకువెళ్లారు. అయితే పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news