లోయల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఘాట్ రోడ్ లో ప్రయాణం కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏ మాత్రం తేడా చేసిన సరే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఫోటోలు దిగే సమయంలో వీడియోలు తీసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి చేసిన చిన్న పొరపాటు అతని ప్రాణం మీదకు వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన,
ప్రవీణ్ ఠాక్రే ఒంటరిగా పూణెలోని సింహగఢ్ కోటను చూడాలనే కోరికతో వెళ్ళాడు. సింహగఢ్ కోట దగ్గరి విండ్ పాయింట్ నుంచి లోయలో పడిపోయాడు. అక్కడ అతనికి ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. నిస్సహాయంగా అక్కడే పడిపోయి ఉన్నాడు అతను. ఎప్పటి మాదిరిగా అతని తల్లి, రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసింది. ప్రవీణ్ తన తల్లికి తాను లోయలో పడిపోయిన విషయాన్ని చెప్పడంతో,
ఆమె బంధువులకు, ప్రవీణ్ స్నేహితులకు ఫోన్ చేసి, అతనిని కాపాడాలని కోరడంతో, ప్రవీణ్ సోదరి తన స్నేహితులతో పడిపోయిన స్థలం వద్దకు వెళ్లి స్థానికుల సహాయంతో ప్రవీణ్ ను లోయ నుంచి బయటకు తీసుకొచ్చింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అతని కాలికి మెడకు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.