ఆధార్ కార్డు మనకి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అన్నింటికీ ఆధార్ కావాలి. పాన్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే ఆధార్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్. అయితే ఆధార్ కార్డుని మనం ఎలా ఈజీగా పొందొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
కొన్ని కొన్ని సార్లు ఆధార్ కార్డుని ఎక్కడ పెట్టామో మరచిపోతూ ఉంటాం. వెతికిన కూడా కనపడవు. చాల మందికి ఇలానే జరుగుతూ ఉంటుంది. మీరు కూడా మీ ఆధార్ కార్డుని పోగొట్టుకున్నారా..? అయితే ఏ దిగులు లేకుండా ఇలా ఈజీగా ఆధార్ ని పొందండి.
#AadhaarTutorials
Download your Aadhaar from https://t.co/C190bVXBCk anytime anywhere.
You can choose to download 'Regular Aadhaar' that displays the complete Aadhaar number or 'Masked Aadhaar' which shows only the last four digits.
To learn more:https://t.co/xfmofQ9jSA— Aadhaar (@UIDAI) June 28, 2021
సులభంగానే క్షణాల్లో వారి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఇబ్బంది లేకుండా ఒకే ఒక సింగిల్ లింక్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ కార్డును సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంతే.
తాజాగా యూఐడీఏఐ ఆధార్ డౌన్‌లోడ్ లింక్‌ను ట్వీట్ చేసింది. ఇందులో డైరెక్ట్ లింక్ ఉంది. మీరు దీనిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈజీగా మాస్క్‌డ్ ఆధార్ కావాలన్నా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.