తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా డీఈఓగా బదిలీలు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం డీఈవోగా ఎస్.యాదయ్య నియమించగా..భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధ రెడ్డిని నియామకం చేసింది సర్కార్. ఎస్ సీఈఆర్టీ ఉప సంచాలకురాలిగా చైతన్య జైనీ నియామకం కాగా…యాదాద్రి భువనగిరి డీఈఓగా చైతన్య జైనీకి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వము. మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా ఎన్.ఎస్.సూర్యప్రసాద్ నియామకం కాగా… మేడ్చల్ మల్కాజిగిరి డీఈఓగా ఎన్.ఎస్.సూర్యప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా నాంపల్లి రాజేష్ నియామకం కాగా…
కరీంనగర్ డీఈఓగా సీహెచ్.వి.ఎస్. జనార్దన్ రావు నియామకం అయ్యారు.అటు రంగారెడ్డి డీఈఓగా పి.సుశీంద్రరావుకు అదనపు బాధ్యతలు అప్పగించిన సర్కార్.. నారాయణపేట డీఈఓగా లియాఖత్ అలీకి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వము. వనపర్తి డీఈఓగా ఎ.రవీందర్ కు అదనపు బాధ్యతలు అప్పగించగా.. జోగులాంబ గద్వాల డీఈఓగా మహ్మద్ సిరాజుద్దీన్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే.. జనగాం డీఈఓగా టి.రాముకు అదనపు బాధ్యతలు అప్పగించగా.. రంగారెడ్డి డీఈఓగా విజయకుమారిని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్.