ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి నీళ్లు ఎక్కువ తాగచ్చు..!

-

మనం ఆరోగ్యంగా ఉండడానికి నీళ్లు కూడా మనకు ఎంతో బాగా సహాయం చేస్తాయి. పురుషులైతే మూడు నుండి నాలుగు లీటర్లు నీళ్లు ప్రతి రోజూ తీసుకుంటుండాలి. మహిళలైతే రెండు నుండి మూడు లీటర్ల నీళ్లు ప్రతిరోజు తాగాలి. అయితే చాలా మంది ఎక్కువ నీళ్ళు తాగడానికి ఇష్టపడరు కొందరయితే మర్చిపోతూ ఉంటారు.

అయితే నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉండొచ్చు. అదే విధంగా బాడీ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయొచ్చు. మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. అయితే ప్రతి రోజూ సరిగ్గా నీళ్లు తాగాలి అంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ప్రతి రోజూ ఈ విధంగా ఫాలో అవ్వడం వల్ల ఎక్కువ నీళ్లు తాగడానికి అవుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.

షెడ్యూల్ చేసుకోండి:

మీరు రోజుల్లో నీళ్లు ఎక్కువ తాగడానికి షెడ్యూల్ చేసుకోండి. ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగడం.. రాత్రి నిద్ర పోయేటప్పుడు ఒక గ్లాసు తాగడం ఇలా మీకు నచ్చినట్లు ప్రతి రోజు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల నీళ్లు తాగడానికి వీలవుతుంది.

హైడ్రేషన్ రిమైండర్:

మీరు మీ ఫోన్లో అలారం పెట్టుకుని మంచి నీళ్లు తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు నీళ్లు తాగాలి అని గుర్తు చేస్తుంది. ఇది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీకు దగ్గరలో వాటర్ బాటిల్ పెట్టుకోండి:

మీరు ఒక బాటిల్ తీసుకుని ఆ బాటిల్ నిండా నీళ్లు ఫిల్ చేసి.. మీకు దగ్గర్లోనే పెట్టుకోండి దీనితో మీకు కనిపించినప్పుడల్లా తాగాలనిపిస్తుంది.

నీళ్లకి బదులుగా మరేమైనా:

ఆస్తమాను నీళ్లు తాగాలని అనిపించకపోతే నీళ్లకి బదులుగా లెమన్ జ్యూస్ లేదా అందులో రెండు తులసి ఆకులు వేసుకోవడం ఇలా వాటర్ ఫ్లేవర్ ని మార్చండి. దీనితో మీకు వాటర్ తాగాలి అనిపిస్తుంది ఇలా నీళ్లు తాగి అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news