తెలంగాణలో దళితబంధు పథకం గురించిన వార్తలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. దళిత కుటుంబాలకు 10లక్షల రూపాయలు అందించే ఈ పథకం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో మొదలైంది. మొదటగా హుజురాబాద్ లో ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ అనుకోని కారణాల వల్ల వాసాలమర్రిలో ప్రారంభమైంది. ఐతే ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు కానుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
ఈ విషయమై కేసీఆర్, ఈ రోజు కరీంనగర్ కు రానున్నారు. దళిత బంధుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతీ కుటుంబానికి దళిత బంధు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆజ్ఞాపించారు. దీనికోసం హుజురాబాద్ నియోజకవర్గంలో సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 2వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగనుంది.