ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి..మిగిలింది అదే..!

-

ఎన్టీఆర్ చరణ్ అభిమానులకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రకటించింది. అయితే కొన్ని పిక్ అప్ సీన్ లకు సంబంధించి మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నామని స్పష్టం చేసింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా 2018 నవంబర్ 19న బైక్ సీన్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ ప్రారంభించామని.. మళ్లీ అదే సీన్ చిత్రీకరణ తో షూటింగ్ పూర్తయ్యిందని వెల్లడించింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సినిమాని తెరకెక్కించారు. సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా అలియా భట్ నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం ప్రారంబించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు టీవీ షో ద్వారానే మొదట చరణ్ ను గెస్ట్ గా పిలిచి సినిమా ప్రమోషన్ ను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news